అధికారులతో టచ్‌లోనే ఉన్నాం... మరేం పర్లేదు

7 Jul, 2021 03:50 IST|Sakshi

ఇంగ్లండ్‌లో కోహ్లి బృందం

విరామం యథాతథం

లండన్‌: ఓ వైపు ఇంగ్లండ్‌ మొత్తం జట్టునే మార్చేసే ఉపద్రవం మహమ్మారి తెచ్చినప్పటికీ... మరోవైపు భారత క్రికెట్‌ జట్టు విరామానికి ఏ ఢోకా లేదని తెలిసింది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత... ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్‌ కోసం కోహ్లి సేన అక్కడే ఉంది. ప్రస్తుతం టీమిండియా 20 రోజుల విరామాన్ని ఆస్వాదిస్తోంది. ‘మేం అక్కడి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాం. ఇంగ్లండ్‌ బోర్డు, స్థానిక ఆరోగ్య అధికారులతో టచ్‌లోనే ఉన్నాం. ఇప్పటివరకైతే వాళ్లెవరు ప్రస్తుత ప్రొటోకాల్‌ను మార్చలేదు. టీమిండియా విరామం– విహారంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.


వింబుల్డన్‌లో అశ్విన్‌

పరిస్థితులకు అనుగుణంగా ప్రొటోకాల్‌లో మార్పు చేస్తే... మేం కూడా వెంటనే వారికి సహకరిస్తాం, మారిన ప్రొటోకాల్‌ను అనుసరిస్తాం’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఇంగ్లండ్‌ వర్గాల నుంచి ప్రస్తుతానికైతే ఎలాంటి సూచనలు రాలేదని చెప్పారు. భారత ఆటగాళ్లు వారి కుటుంబసభ్యులతో లండన్‌ వీధుల్లో షికారు చేస్తున్నారు. ఈ నెల 14న మళ్లీ ఆటగాళ్లంతా జట్టుకడతారు. అక్కడి నుంచి డర్హమ్‌ వెళ్లి రెండు వారాల పాటు ట్రెయినింగ్‌ సెషన్స్, కౌంటీ ఎలెవన్‌ జట్టుతో సన్నాహక మ్యాచ్‌ ఆడతారు. భారత్‌లో తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకొని ఇంగ్లండ్‌ చేరిన భారత క్రికెటర్లకు బుధవారం, శుక్రవారం రెండో డోసు వ్యాక్సిన్‌ వేయనున్నారు.   

మరిన్ని వార్తలు