ఆసీస్‌తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?

25 Sep, 2023 20:25 IST|Sakshi

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొహాలీలో వేదికగా జరిగిన తొలి వన్డేను 5 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఇండోర్‌లో నిన్న (సెప్టెంబర్‌ 24) జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే ఈనెల 27న రాజ్‌కోట్‌లో జరుగనుంది. 

రోహిత్‌ రీఎంట్రీ..
ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ శర్మ మూడో వన్డే బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఈ వన్డేకు శుభ్‌మన్‌ గిల్‌కు రెస్ట్‌ ఇవ్వడంతో యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌తో కలిసి హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. 

విరాట్‌, హార్దిక్‌ కూడా..
తొలి రెండు వన్డేలకు రోహిత్‌తో పాటు రెస్ట్‌ తీసుకున్న విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లు సైతం మూడో వన్డే బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరితో పాటు రెండో వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా సైతం ఆఖరి వన్డే బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. జట్టు మేనేజ్‌మెంట్‌ జడేజాకు రెస్ట్‌ ఇవ్వాలని భావిస్తేనే కుల్దీప్‌ బరిలో ఉంటాడు. అశ్విన్‌ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది.

తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన సిరాజ్‌ ఈ మ్యాచ్‌లో కూడా నిరీక్షించాల్సి ఉంటుంది. గిల్‌తో పాటు తొలి రెండు వన్డేలు ఆడిన శార్దూల్‌ ఠాకూర్‌ కూడా రెస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకే ప్రకటించిన వరల్డ్‌కప్‌ జట్టులో నుంచి సైతం శార్దూల్‌ను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. అతని స్థానంలో అశ్విన్‌ జట్టులోకి రావడం ఖాయమని సమాచారం​.

ఆసీస్‌తో మూడో వన్డేకు భారత తుది జట్టు (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), అశ్విన్‌,  కుల్దీప్‌ యాదవ్‌, షమీ, బుమ్రా

మరిన్ని వార్తలు