Asia Cup 2022 IND VS HK: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌

1 Sep, 2022 16:01 IST|Sakshi

టీమిండియా ప్రస్తుత, తాజా మాజీ కెప్టెన్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు పోటాపోటీన ఒకరి రికార్డులు మరొకరు బద్దలు కొట్టడం లేదా సమం చేయడం లాంటివి ఇటీవలి కాలంలో మనం తరుచూ గమనిస్తూ ఉన్నాం. ఆసియా కప్‌ 2022లో భాగంగా నిన్న  హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఈ సీన్‌ మరోసారి రిపీట్‌ అయ్యింది. 

తొలుత భారత ఇన్నింగ్స్‌ సమయంలో కోహ్లి.. రోహిత్‌ పేరిట ఉండిన అత్యధిక టీ20 అర్ధసెంచరీల రికార్డును (31) సమం చేయగా, హాంగ్‌కాంగ్‌పై గెలుపుతో రోహిత్‌.. కోహ్లి పేరటి ఉండిన సెకండ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ ఇండియన్‌ కెప్టెన్‌ రికార్డును చెరిపేశాడు. తాజా గెలుపుతో రోహిత్‌ సారధ్యంలో టీమిండియా 37 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించగా.. కోహ్లి కెప్టెన్‌గా టీమిండియా 50 టీ20ల్లో 30 సార్లు గెలుపొందింది. 

టీమిండియా మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ రికార్డు ఎంఎస్‌ ధోని (72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు) పేరిట ఉండగా.. హాంగ్‌కాంగ్‌పై విజయంతో రోహిత్‌ కోహ్లిని వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు.

ఇదిలా ఉంటే, హాంగ్‌కాంగ్‌తో నిన్న (ఆగస్ట్‌ 31) జరిగిన మ్యాచ్‌లో కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్‌ (44 బంతుల్లో 59 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), సూర్య భాయ్‌ నాటు కొట్టుడు (26 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దెబ్బకు టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. భారత్‌ వచ్చే ఆదివారం (సెప్టెంబర్‌ 4)  సూపర్‌-4లో పాక్‌తో తలపడే అవకాశం ఉంది.
చదవండి: Ind Vs Hk: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా..

 

Poll
Loading...
మరిన్ని వార్తలు