రోహిత్‌ ఔట్‌, టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా.. బీసీసీఐ అధికారిక ప్రకటన 

30 Jun, 2022 19:02 IST|Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రేపటి (జులై 1) నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. రోహిత్‌కు ఇవాళ ఉదయం జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ కోవిడ్‌ పాజిటివ్‌గానే ఉన్నందున, ఐదో టెస్ట్‌కు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ వ్యవహరిస్తాడని ఆయన పేర్కొన్నారు. 


చదవండి: టీమిండియాతో ఐదో టెస్ట్‌: జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీ

>
మరిన్ని వార్తలు