Rohit Sharma: 'ఆందోళన అవసరం లేదు.. ఎలా ఆడాలో మాకు తెలుసు'

30 Mar, 2023 08:24 IST|Sakshi

మార్చి 31న ఐపీఎల్‌ 16వ సీజన్‌కు తెరలేవనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, డిపెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 16వ సీజన్‌ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్‌ చేశారు. మరి ఈసారి ఎవరు ఫెవరెట్‌ అనేది చెప్పడం కాస్త కష్టమే. ఐదుసార్లు టైటిల్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ గత రెండు సీజన్లుగా మాత్రం ఆకట్టుకోవడం లేదు. గతేడాది దారుణ ఆటతీరు కనబరిచిన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. 

అయితే ఈసారి మాత్రం తాము కచ్చితంగా టైటిల్‌ గెలుస్తామని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్‌ 2న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ను ఆరంభించనుంది. కాగా రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు. ప్రతి మ్యాచ్‌లో బరిలో దిగేముందు తమపై భారీ అంచనాలు ఉంటాయని... అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే శాయశక్తులా కృషి చేస్తామని ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు.

ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్న తనకు ఇతరుల అంచనాల గురించి ఆందోళన లేదని, అనవసర ఆలోచనలతో ఒత్తిడి పెంచుకోనని... ఎలా ఆడితే మళ్లీ విజేతగా నిలుస్తామో అనే అంశం గురించే ఆలోచిస్తామని ఐదుసార్లు ముంబై జట్టును ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్‌ వ్యాఖ్యానించాడు.   

చదవండి: రిషబ్‌ పంత్‌ స్థానంలో బెంగాల్‌ సంచలనం!

మరిన్ని వార్తలు