Asia Cup 2022: రోహిత్‌ సిక్సర్‌; వెనక తగిలింది కాబట్టి సరిపోయింది.. ముందు తాకుంటే!

6 Sep, 2022 22:40 IST|Sakshi

ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా, శ్రీలంక మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత్‌ కెప్టెన​ రోహిత్‌ శర్మ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే రోహిత్‌ శర్మ కొట్టిన ఒక సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ 10వ  ఓవర్‌ అసితా ఫెర్నాండో వేశాడు.

ఓవర్‌ తొలి బంతినే రోహిత్‌ డీప్‌స్క్వేర్‌ లెగ్‌ దిశగా సిక్సర్‌ బాదాడు. అయితే ఇక్కడే ఊహించని ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకు వెనుక వైపు తాకింది. వెనుకకు తిరిగి ఉన్నాడు కాబట్టి సరిపోయింది.. అదే ఒకవేళ ముందుకు నిల్చొని ఉండుంటే సీన్‌ సితార్‌ అయ్యేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానకి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 72 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ 34 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్‌ మధుషనక 3, దాసున్‌ షనక, చమిక కరుణరత్నే చెరో రెండు వికెట్లు, మహిష్‌ తీక్షణ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: Rohit Sharma: ఆసియా కప్‌లో రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర.. సచిన్‌ రికార్డు బద్దలు

US Open 2022: అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్‌ దించకుండా తాగింది

మరిన్ని వార్తలు