ముంబై ఇండియన్స్‌ ఓటమి: సారీ నీ పూజలు ఫలించలేదు

10 Apr, 2021 18:52 IST|Sakshi

ముంబై: క్రికెట్‌, సినిమాలు అంటే భారతీయులకు పిచ్చి. మన దేశంలో సినిమా యాక్టర్లను, క్రికెటర్లను దేవుళ్లుగా కొలిచే వీరాభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. వారి కోసం ఏమైనా చేస్తారు ఫ్యాన్స్‌. సినిమా తారలకు గుళ్లు కట్టడం.. పాలాభిషేకాలు చేయడం వంటివి చేస్తారు. ఇక క్రికెట్‌ విషయానికి వస్తే.. తమ అభిమాన జట్టు గెలుపు కోసం ప్రత్యేకంగా పూజలు, యాగాలు చేసే అభిమానులున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ అభిమాని ఐపీఎల్‌ 2021లో తన ఫేవరెట్‌ జట్టు గెలవాలని ఏకంగా టీవీకే హరతిచ్చి.. పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ వివరాలు..

ఐపీఎల్‌ 2021 శుక్రవారం ప్రారంభమయ్యింది. తొలిరోజు ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడ్డాయి. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ వీరాభిమాని ఒకరు ముంబై ఇండియా గెలవాలని కోరుకుంటూ.. టీవీలో ప్రసారం అవతున్న రోహిత్‌ శర్మ ఫోటోకి హారతిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘పాపం నీ పూజలు ఫలించలేదు.. రోహిత్‌ శర్మ జట్టు ఓడిపోయింది.. పర్లేదులే.. ఫైనల్‌లో గెలవడానికి నీ పూజలు పనికి వస్తాయి’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌తో ఆరంభం అయ్యింది. ఇందులో ఆర్సీబీ 160 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించి గెలిచింది. ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 

చదవండి: రనౌట్‌ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు