'థ్యాంక్స్‌ పీటర్సన్‌.. అర్థం చేసుకున్నందుకు'

27 Feb, 2021 17:35 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ థ్యాంక్స్‌ చెప్పాడు. అసలు విషయంలోకి వెళితే.. మొటేరా వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఫలితంపై పలువురు మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పిన్‌ పిచ్‌కు అనుకూలించే ఈ పిచ్‌ టెస్టు మ్యాచ్‌లకు పనికిరాదంటూ విమర్శలు గుప్పించారు. అయితే పీటర్పన్‌ మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్‌ బాల్‌ టెస్టుపై కాస్త భిన్నంగా స్పందించాడు.

''మ్యాచ్‌ తర్వగా ముగియడం నిరాశ కలిగించినా.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే అందుకు  ప్రధాన కారణం.  స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరు జట్లు బ్యాటింగ్‌లో విఫలమయ్యాయి. ఆటగాళ్లు నిజాయితీగా ఉంటే ఫేలవంగా ఆడామని వారే ఒప్పుకుంటారు. కొందరు పని గట్టుకొని పిచ్‌ను విమర్శించడం నచ్చలేదు. అయినా మ్యాచ్‌లో 30 వికెట్లు పడితే .. అందులో 21 వికెట్లు నేరుగా వేసిన బంతుల వల్లే పడ్డాయి. వాస్తవానికి పిచ్‌తో ఎలాంటి ప్రమాదం లేదు. బ్యాట్స్‌మెన్‌ కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే మ్యాచ్‌ మూడు, నాలుగు రోజుల దాకా వెళ్లి ఉండేది. అంటూ చెప్పుకొచ్చాడు.

పీటర్సన్‌ కామెంట్స్‌పై రోహిత్‌ శర్మ స్పందిస్తూ.. ''థ్యాంక్స్‌ పీటర్సన్‌.. కనీసం ఆట గురించి ఒక్కరైనా అర్థం చేసుకున్నందుకు'' అంటూ తెలిపాడు. మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌ వేదికగానే జరగనుంది.
చదవండి: పింక్‌ బాల్‌ టెస్టు: పీటర్సన్‌ ట్వీట్‌ వైరల్‌
వాళ్లు ఆలోచించరు.. మాకు అవసరమా: రోహిత్‌

A post shared by Kevin Pietersen 🦏 (@kp24)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు