Asia Cup 2022 IND Vs PAK: రోహిత్‌ తప్పు చేశాడా!.. పంత్‌ను పక్కనబెట్టడంపై విమర్శలు

28 Aug, 2022 21:02 IST|Sakshi

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు రిషబ్‌ పంత్‌ను పక్కనబెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆసియా కప్‌ 2022లో భారత్‌కి ఇదే ఫస్ట్ మ్యాచ్‌కాగా.. పవర్ హిట్టర్‌గా పేరొందిన రిషబ్ పంత్‌ని పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని తుది జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలో వెల్లడించాడు. 

కాగా రోహిత్‌ నిర్ణయంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ విమర్శలు కురిపించారు. అయితే జట్టులో ఒకటి నుంచి ఏడో స్థానం వరకు జడేజా మినహా ఒక్క లెఫ్ట్‌ హ్యాండర్‌ లేడు. జట్టు సమతుల్యంగా ఉండాలంటే లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న లాజిక్‌ రోహిత్‌ ఎలా మరిచిపోయాడని అభిమానులు పేర్కొన్నారు.  

ఇక గత ఏడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత దినేశ్ కార్తీక్ కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా మ్యాచ్‌లను చక్కగా ఫినిష్ చేస్తూ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగా షాట్స్ ఆడేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరీ ముఖ్యంగా.. జట్టు గెలుపు ముంగిట నిలిచిన దశలోనూ అతను తన ఆటతీరుని మార్చుకోవడం లేదు. దాంతో.. అతను తన వికెట్‌కి విలువ ఇవ్వడం లేదనే అపవాదు ఉంది. పాకిస్థాన్‌తో ఒకవేళ చివరి నాలుగు ఓవర్లలో క్రీజులో నిలిచిన మ్యాచ్‌ని ఫినిష్ చేయాల్సి వస్తే? రిషబ్ పంత్ కంటే దినేశ్ కార్తీక్‌ను ఆడించడమే మంచిదని టీమిండియా భావించి ఉంటుంది. 

చదవండి: IND Vs PAK Fakhar Zaman: ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం..

మరిన్ని వార్తలు