Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్‌

16 Aug, 2022 21:02 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జెండావందనం(ఆగస్టు 15) సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యాడు. ట్విటర్‌లో ఫోటో షేర్‌ చేయడమే అతని ట్రోల్‌ వెనుక కారణం. విషయంలోకి వెళితే.. ఆగస్టు 15.. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘75 సంవత్సరాల స్వాతంత్ర్యం.. అందరికీ శుభాకాంక్షలు’  అని త్రివర్ణ పతకాన్ని పట్టుకున్న ఫోటోను షేర్‌ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది.

అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. వాస్తవానికి రోహిత్‌ చేతిలో ఎలాంటి జెండా లేదని.. అది అంతా ఫోటోషాప్‌లో ఎడిట్‌ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. రోహిత్ పట్టుకున్న జెండా,  జెండా కర్ర అన్నీ ఫోటోషాప్ లో చేసిన గ్రాఫిక్స్‌లాగా కనిపించింది. అంతేకాదు హిట్‌మ్యాన్‌ పట్టుకున్న జెండా కర్రలో ఒక దగ్గర రెండుగా చీలినట్టుగా స్పష్టంగా కనిపిస్తన్నది. హిట్ మ్యాన్ పట్టుకున్న కర్రకు జాతీయ జెండా ఉన్న రాడ్‌ను అతికించారని కొంతమంది ఆరోపించారు.

దీంతో రోహిత్‌ను ట్రోల్‌ చేస్తూ అతని జెండా ఫోటోను వరుసపెట్టి షేర్‌ చేస్తూ కామెంట్లతో రెచ్చిపోయారు. ‘నేను జెండా ఒక్కటే ఎడిటెడ్ అనుకున్నా.. రాడ్ కూడానా.. చూస్తుంటే రోహిత్ శర్మ కూడా గ్రాఫిక్సేనేమో అన్న అనుమానం కలుగుతోంది నాకు..’ అని కామెంట్ చేశారు. ‘ రోహిత్‌ దగ్గర కోట్లకు కోట్ల డబ్బులున్నాయి. ఇలా ఎడిట్ చేసుకోవడమెందుకు..? ఓ జాతీయ జెండా, జెండా కర్రను కొనుక్కోలేడా..?’, ‘ఈ ఫోటో చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ ఎడిటింగ్ను అతడు ఏ కెమెరాతో చేసుంటాడు..?’ అని కామెంట్స్ చేస్తున్నారు.

చదవండి: గాయాలతోనే ఏడాది గడిచిపోయింది.. జట్టులోకి వచ్చేదెన్నడు?

కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్‌ శర్మ అలా కాదు!

మరిన్ని వార్తలు