ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్‌ శర్మ భార్య ఆగ్రహం

1 Jan, 2023 10:58 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితికా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంత్‌ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడాన్ని తప్పుబట్టారు. బాధితులకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారని, ఈ ఫొటోలు వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మండిపడ్డారు.

"రిషబ్ పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన వారిని చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వారికి కావాల వద్దా అనేది నిర్ణయించుకోలేరు. సదరు బాధితుల వ్యక్తుల ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం వల్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా ప్రభావితమవుతారు. కనీస జ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు " అని రితికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

ఇక శ్రీలంకతో సిరీస్‌కు దూరమైన పంత్‌ కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా.. రూర్కీ సమీపంలో అతడి కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్‌ నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్‌కు చిన్న ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్‌ సంఘం డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ తెలిపాడు. ‘ఢిల్లీ నుంచి ఓ బృందం డెహ్రాడూన్‌లోని దవాఖానకు వెళ్లి రిషబ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్లాస్టిక్‌ సర్జారీ అవసరం కావడంతో అక్కడే వైద్యం అందించారు. బీసీసీఐ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నది’ అని ఆయన అన్నారు.

పంత్‌ గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆ్రస్టేలియాతో స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు పంత్‌ దూరం కానున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్‌–మే నెలలో జరిగే ఐపీఎల్‌ టి20 టోరీ్నలో కూడా పంత్‌ ఆడేది అనుమానమే.

చదవండి: పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా సంచలన వ్యాఖ్యలు

నిలకడగా రిషబ్‌ పంత్‌ ఆరోగ్యం

మరిన్ని వార్తలు