IND vs SA: 'రోహిత్‌ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు'

5 Jun, 2022 15:59 IST|Sakshi

టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్‌9న ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి,జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ వంటి సీనియర్‌ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ పేసర్‌ ఆర్పీ సింగ్‌ స్పందించాడు. ఈ సిరీస్‌కు రోహిత్‌ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్పీ సింగ్‌ అభిప్రాయపడ్డాడు.

"రోహిత్‌ ఈ సిరీస్ ఆడాలని నేను భావిస్తున్నాను. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనేది అతడి వ్యక్తిగత ఆలోచన. విశ్రాంతి అనేది అతడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది.  కానీ అతడికి బ్రేక్‌ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది సుదీర్ఘ సిరీస్ అని మనకు తెలుసు. అంతేకాకుండా అతడు కెప్టెన్‌ కాబట్టి ఈ సిరీస్‌లో ఖచ్చితంగా ఆడాలి. ఐపీఎల్‌లో రోహిత్ గత కొన్ని సీజన్లో 400కి పైగా పరుగులు చేయలేదు.

400 పరుగుల మార్క్‌ను దాటిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో అతడు నిలకడగా రాణించలేకపోతున్నాడు. కానీ రెండు మూడు సార్లు అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించాడు. కాబట్టి రోహిత్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేయగలడని అందరూ భావిస్తారు. టీ ఫార్మాట్‌లో జట్టుకు మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడే బ్యాటర్లు కావాలి. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన జట్టు విజయం సాధిస్తుందిని" ఆర్పీ సింగ్‌ పేర్కొన్నాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2022లోను రోహిత్‌ తీవ్రంగా నిరాశ పరిచాడు. 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ కేవలం 268 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: బీజేపీకి షాక్‌.. అమిత్‌ షాకు క్రీడా శాఖ ఇవ్వాల్సింది.. షాకింగ్‌ కామెం‍ట్స్‌

మరిన్ని వార్తలు