ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌

4 Aug, 2022 05:39 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రథమ మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌(58) బాధ్యతలు చేపట్టారు. సంబంధిత అధికార పత్రాలను మంగళవారం ఆమె ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌కు అందజేశారు.

1987 ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన రుచిరా కాంబోజ్, గతంలో భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 2002–2005 సంవత్సరాల్లో ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో రుచితా జూన్‌లో నియమితులయ్యారు. 

మరిన్ని వార్తలు