చెస్‌ ఒలింపియాడ్‌ విజేత ప్రకటనపై విమర్శలు

5 Sep, 2020 08:11 IST|Sakshi

విజేత లేకుంటే ఆ టోర్నీ విఫలమైనట్టే

రష్యా చెస్‌ ప్లేయర్‌ డానీల్‌ డుబోవ్‌

మాస్కో: ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో సంయుక్త విజేతను ప్రకటించడంపై తాజాగా విమర్శలు మొదలయ్యాయి. ఎంతటి ప్రాధాన్యమైన టోర్నీ అయినా సరైన విజేత లేకుంటే అది విఫలమైన టోర్నీగానే మిగులుతుందని రష్యా జట్టు సభ్యుడు డానీల్‌ డుబోవ్‌ విమర్శించాడు. 2018 ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌ అయిన డుబోవ్‌ ఇరు జట్లకు పసిడి పతకాన్ని అందించడం తనకు నచ్చలేదని పేర్కొన్నా డు. ఆటగాళ్లెవరినీ సంప్రదించకుండానే సంయుక్త విజేతలుగా ‘ఫిడే’ ప్రకటించడం తనకు నిరాశ కలిగించిందని అన్నాడు. చివరి రెండు గేములు మళ్లీ ఆడేందుకు ఆటగాళ్లంతా సుముఖంగానే ఉన్నారు. కానీ మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఇలా గెలవాలని మేమెప్పుడూ అనుకోలేదు’ అని డుబోవ్‌ వ్యాఖ్యానించాడు. 

చదవండి: 
ఇకనైనా గుర్తించాలి 

సంయుక్త విజేతలుగా భారత్, రష్యా

మరిన్ని వార్తలు