మంచి ఆఫర్‌ మిస్‌ చేసుకున్న రష్యన్‌ ఫుట్‌బాలర్‌

13 Nov, 2022 16:50 IST|Sakshi

ఫుట్‌బాల్‌ ప్రేమికులకు నవంబర్‌ 20 నుంచి పెద్ద పండగ. ఎందుకంటే ఆరోజు నుంచే ఖతార్‌ వేదికగా ఫిపా వరల్డ్‌కప్‌ మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ ఉన్న ఫిఫాను చూసేందుకు ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సాకర్‌ సమరంలో ఆడేందుకు అన్ని జట్లు తమ ఆటగాళ్లతో సిద్ధమవుతున్నాయి. ఇక గోల్స్‌ వర్షం షురూ కానుంది.

ఈ సంగతి పక్కనబెడితే.. ఒక రష్యన్‌ ఫుట్‌బాలర్‌కు పోర్న్‌స్టార్‌ ఇచ్చిన ఆఫర్‌ తెలిస్తే షాకవ్వడం ఖాయం. అయితే ఇది ఏడేళ్ల కిందటి మాట. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌ మొదలుకానున్న నేపథ్యంలో పోర్న్‌స్టార్‌ ఇంటర్య్వూ మరోసారి వెలుగులోకి వచ్చింది. 2015లో రష్యన్‌ ఫుట్‌బాలర్‌ అలెగ్జాండర్ కోకోరిన్‌కు పోర్న్‌స్టార్‌ అలీనా యెరెమెన్కో బంపరాఫర్‌ ఇచ్చింది. అప్పట్లో అలెగ్జాండర్‌ కోకోరిన్‌ డైనమో మాస్కోకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రష్యన్‌ యూరోస్పోర్ట్స్‌కు అలీనా యెరెమెన్కో ఇంటర్య్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రష్యన్‌ ఫుట్‌బాలర్స్‌కు మీరిచ్చే మార్కులు ఎన్ని అనే ప్రశ్న తగిలింది. దీనిపై స్పందించిన ఆమె ఆటగాళ్లకు రేటింగ్‌ ఇస్తూ పోతుంది. ఇక్కడే అలెగ్జాండర్‌ కోకోరిన్‌ కనిపించాడు. అతన్ని చూడగానే కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ పదికి 10 మార్కులు ఇవ్వడంతో పాటు ఒక బంపరాఫర్‌ కూడా ఇచ్చింది. 

''అలెగ్జాండర్‌ కోకోరిన్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్నాడు. రష్యన్‌ సూపర్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌ ముగిసేలోగా అతను కనీసం ఐదు గోల్స్‌ చేయాలి. అలా చేస్తే అలెగ్జాండర్‌తో 16 గంటల సెక్స్‌ సెషన్‌లో పాల్గొనేందుకు నేను సిద్ధం.'' అంటూ పేర్కొంది. ఇదంతా ఏప్రిల్‌ నెలలో జరిగిందని.. అప్పటికి డైనమో మాస్కో చేతిలో మరో 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని రష్యా యూరోస్పోర్ట్స్‌ తమ కథనంలో వెల్లడించింది.

అయితే అలీనా ఇచ్చిన ఆఫర్‌ను అలెగ్జాండర్‌ మిస్‌ చేసుకున్నాడు. ఆ తర్వాతి 10 మ్యాచ్‌ల్లో కలిసి ఒక్క గోల్‌ మాత్రమే కొట్టగలిగాడు. మొత్తంగా ఏడాదిలో 39 మ్యాచ్‌లాడి 10 గోల్స్‌ సాధించాడు. అలా అలీనా ఆఫర్‌ను మిస్‌ చేసుకున్న అలెగ్జాండర్‌ తర్వాతి కాలంలో డైనమో మాస్కోను వదిలి జెనిట్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించి రష్యన్‌ కప్‌ గెలిచాడు. ప్రస్తుతం ఈ స్ట్రైకర్‌ అరిస్‌ లిమాస్సోల్‌ క్లబ్‌కు ఆడుతున్నాడు.

 
 
 

 

 
 

 

 

 

A post shared by Kok9rin (@kokorin9)

మరిన్ని వార్తలు