వింబుల్డన్‌ ఆడేందుకు రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన టెన్నిస్‌ క్రీడాకారిణి 

20 Jun, 2022 16:48 IST|Sakshi

Natela Dzalamidze: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను క్రీడా ప్రపంచం మొత్తం సామూహికంగా బహిష్కరించిన నేపథ్యంలో ఓ టెన్నిస్‌ క్రీడాకారిణి తన కెరీర్‌ కోసం రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న వింబుల్డన్-2022 పాల్గొనేందుకు రష్యాకు చెందిన నటేల జలమిడ్జే ఏకంగా తన జాతీయతను మార్చుకోవాలని డిసైడైంది. తాను రష్యన్ కాదని.. జార్జియా తరఫున ఆడతానని నటేల వింబుల్డన్ నిర్వాహకులను మొరపెట్టుకుంది.

రష్యా ఆటగాళ్లెవరూ వింబుల్డన్‌లో పాల్గొనడానికి వీళ్లేదని టోర్నీ నిర్వహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో నటేల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల నటేల అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా)తో కలిసి మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు తన పేరును రిజిస్టర్‌ చేసుకుంది. కాగా, ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను, ఆ దేశానికి వంతపాడుతున్న బెలారస్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సహా తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు ఇదివరకే వెలివేసిన (నిషేధం) విషయం తెలిసిందే. 
చదవండి: కోచ్‌పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్‌1 ఆటగాడు.. వీడియో వైరల్‌..!

>
మరిన్ని వార్తలు