IPL 2021: ఏడుసార్లలో మూడు కేకేఆర్‌పైనే.. అన్ని గెలుపే

15 Oct, 2021 20:24 IST|Sakshi

Ruturaj Gaikwad And Faf Du Plesis.. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక అరుదైన రికార్డు సాధించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌లు ఈ సీజన్‌లో తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఏడోసారి. కాగా ఇందులో మూడుసార్లు కేకేఆర్‌పైనే నమోదు చేశారు. ఇంకో విశేషమేమిటంటే.. సీఎస్‌కే ఓపెనర్లు అర్థసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఆరు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే విజయం సాధించడం విశేషం.

ఇక సీఎస్‌కే ఓపెనర్లుగా రుతురాజ్‌- డుప్లెసిస్‌ జోడి ఈ సీజన్‌లో 756 పరుగులు జోడించి ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలో మూడో స్థానంలో నిలిచారు. కోహ్లి- డివిలియర్స్‌(ఆర్‌సీబీ) జోడి 2016 ఐపీఎల్‌ సీజన్‌లో 939 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. డేవిడ్‌ వార్నర్‌- బెయిర్‌ స్టో జోడి(ఎస్‌ఆర్‌హెచ్‌) 2019 ఐపీఎల్‌ సీజన్‌లో 791 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు