Ruturaj Gaikwad: సచిన్‌, డివిలియర్స్‌ వంటి దిగ్గజాల సరసన రుతు.. రోహిత్‌తో పాటు

29 Nov, 2022 10:32 IST|Sakshi
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ (PC: BCCI Domestic Twitter)

Vijay Hazare Trophy 2022 - Maharashtra vs Uttar Prades: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాది చరిత్ర సృష్టించిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

రెండో క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా యూపీతో మ్యాచ్‌లో రుతురాజ్‌ ద్విశతకం సాధించాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 220 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సెమీస్‌కు చేర్చిన రుతు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

దిగ్గజాలతో పాటుగా
ఈ నేపథ్యంలో.. ద్విశతక వీరుడు రుతురాజ్‌ గైక్వాడ్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో సచిన్‌ టెండుల్కర్‌ వంటి దిగ్గజాల సరసన చేరాడు. వన్డే ఫార్మాట్‌లో డబుల్‌ సాధించిన పదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు సచిన్‌ టెండుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యశస్వి జైశ్వాల్‌, సంజూ శాంసన్‌, శిఖర్‌ ధావన్‌, సమర్థ్‌ వ్యాస్‌, కరణ్‌ కౌశల్‌, పృథ్వీ షా ఈ ఘనత సాధించగా.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏకంగా మూడు సార్లు ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

సిక్సర్ల వీరుడిగా.. రోహిత్‌ సరసన
లిస్ట్‌- ఏ క్రికెట్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోకి రుతురాజ్‌ గైక్వాడ్‌ చేరాడు. రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు.

లిస్ట్‌- ఏ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టింది వీరే!
►డి'ఆర్సీ షార్ట్ (2018)- ఆస్ట్రేలియా - 23
►గెర్రీ స్నిమాన్ (2007)- నమీబియా - 17
►ఇయాన్ మోర్గాన్ (2019)- ఇంగ్లండ్‌- 17
►రోహిత్ శర్మ (2013) -ఇండియా- 16
►ఏబీ డివిలియర్స్ (2015) సౌతాఫ్రికా - 16
►క్రిస్ గేల్ (2015)- వెస్టిండీస్‌ - 16
►సౌమ్య సర్కార్ (2019)- బంగ్లాదేశ్‌ - 16
►జస్కరన్ మల్హోత్రా (2021)- అమెరికా - 16
►రుతురాజ్ గైక్వాడ్ (2022) -ఇండియా- 16

చదవండి: ​6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8!
 

మరిన్ని వార్తలు