Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం

26 Feb, 2022 09:03 IST|Sakshi

టీమిండియా యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. లంకతో టి20 సిరీస్‌కు ఎంపికైన రుతురాజ్‌ గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొలి టి20లో బెంచ్‌కే పరిమితమైన రుతురాజ్‌ రెండో టి20లో జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ రుతురాజ్‌కు కుడిచేయి మణికట్టు గాయం తిరగబెట్టిందని.. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ అతన్ని పర్యవేక్షిస్తోందన్నారు. గాయం తీవ్రత తేలకపోవడంతో మిగతా మ్యాచ్‌లకు రుతురాజ్‌ దూరమయ్యాడని తెలిపారు.

రుతురాజ్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేశామని పేర్కొన్నాడు. దీంతో చండీఘర్‌లో ఉన్న మయాంక్‌ ధర్మశాలలో ఉన్న టీమ్‌తో జాయిన్‌ అయ్యాడు. మయాంక్‌ జట్టుతో కలిసినప్పటికి బయోబబూల్‌లో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. కాగా రుతురాజ్‌ వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు దూరమైన సంగతి తెలిసిందే. ఇక లంకతో తొలి టి20లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా శనివారం రెండో టి20 ఆడనుంది. ఒక మ్యాచ్‌ మిగిలిఉండగానే సిరీస్‌ను గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్‌ లైనఫ్‌ను లంక బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే...

మరిన్ని వార్తలు