Vijay Hazare Trophy: సెంచరీల మోత మోగిస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌

11 Dec, 2021 13:15 IST|Sakshi

సీఎస్‌కే స్టార్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్ వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. దేశవాలీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు నాయకత్వం వహిస్తున్న రుతురాజ్‌ వరుసగా మూడో సెంచరీ సాధించాడు. కేరళతో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రుతురాజ్‌ 110 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 పరుగులు చేసిన రుతురాజ్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రుతురాజ్‌కు తోడుగా రాహుల్‌ త్రిపాఠి(108 బంతుల్లో 99 పరుగులు , 11 ఫోర్లు) రాణించడంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కేరళ ముందు 292 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా రుతురాజ్‌ ఇంతకముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్‌ఘర్‌తో మ్యాచ్‌లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్‌) మెరిశాడు. 

చదవండి: Vijay Hazare Trophy: సెంచరీలతో చెలరేగిన రుతురాజ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌

కాగా రుతురాజ్‌ ఇంతకముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (112 బంతుల్లో 136 పరుగులు), చత్తీస్‌ఘర్‌తో మ్యాచ్‌లో (143 బంతుల్లో 154 పరుగులు నాటౌట్‌) మెరిశాడు. ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌లో 635 పరుగులతో రుతురాజ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచి సీఎస్‌కే టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌ మెగావేలానికి ముందు సీఎస్‌కే తన రిటైన్‌ జాబితాలో జడేజా, ధోని, మొయిన్ అలీలతో పాటు రుతురాజ్‌ను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్‌ సహా ఐదుగురి రికార్డు బద్దలు

మరిన్ని వార్తలు