IND vs AUS: చరిత్ర సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. తొలి భారత ఆటగాడిగా

28 Nov, 2023 21:58 IST|Sakshi

గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో​ మూడో టీ20లో టీమిండియా యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే రుతురాజ్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

రుతురాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్‌ 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 123 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో మెరుపు శతకంతో చెలరేగిన రుత్‌రాజ్‌ చెలరేగిన పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

రుతు సాధించిన రికార్డులు ఇవే..

టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రుత్‌రాజ్‌ రికార్డులకెక్కాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రెండో క్రికెటర్‌గా గైక్వాడ్‌(123)) నిలిచాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో మరో భారత యంగ్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లో గిల్‌ 126 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా రుతురాజ్‌ చరిత్రకెక్కాడు. గైక్వాడ్‌ కంటే ముందు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, సురేష్‌ రైనా, విరాట్‌ కోహ్లి, దీపక్‌ హుడా, యశస్వీ జైశ్వాల్‌ ఉన్నారు.
చదవండి: IND vs AUS: రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసకర సెంచరీ.. కేవలం 52 బంతుల్లోనే

మరిన్ని వార్తలు