SA Vs Eng: అన్నా.. ఏందన్నా ఇది! ఇలాంటి షాట్‌ ఎవరూ ట్రై చేసి ఉండరు! వైరల్‌

2 Feb, 2023 11:00 IST|Sakshi
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మొయిన్‌ అలీ (PC: Twitter )

South Africa vs England, 3rd ODI- Moeen Ali: ఇంగ్లండ్‌- సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఒంటిచేత్తో షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. స్విచ్‌ హిట్‌ బాదాలని ప్రయత్నించిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. ఫెయిలయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి షాట్‌ ఆడేందుకు ట్రై చేయలేదు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆతిథ్య ప్రొటిస్‌ జట్టు.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.

అదరగొట్టిన మలన్‌, బట్లర్‌, అలీ
ఇక నామమాత్రపు మూడో వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌కు ఊరట విజయం దక్కింది. డేవిడ్‌ మలన్‌ 118 పరుగులు, జోస్‌ బట్లర్‌ 131 పరుగులతో చెలరేగడంతో 59 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపొందింది. వీరికి తోడు మొయిన్‌ అలీ 41 రన్స్‌తో రాణించాడు. దీంతో బట్లర్‌ బృందం క్లీన్‌స్వీప్‌ గండం నుంచి గట్టెక్కింది.

ఇదేం షాట్‌ భయ్యా
అయితే, ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 44వ ఓవర్‌ మూడో బంతికి తబ్రేజ్‌ షంసీ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ రివర్స్‌ హిట్‌కు యత్నించిన తీరు ఆశ్చర్యపరిచింది. షంసీ వేసిన షార్ట్‌బాల్‌ను కుడిచేతితో బౌండరీకి తరలించాలని భావించిన ఈ లెఫ్టాండర్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక తర్వాతి బంతికి మాత్రం భారీ సిక్సర్‌ బాది చైనామన్‌ స్పిన్నర్‌ షంసీకి షాకిచ్చాడు. 

సోషల్‌ మీడియాలో వైరల్‌
సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘అన్నా ఏందన్నా ఇది! బహుశా ఎవరూ కూడా మరీ ఇంత వింతైన షాట్‌ ట్రై చేసి ఉండరు. మేమైతే ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అలీ భాయ్‌!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.  

కాగా మూడో వన్డేలో బట్లర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. అలీ ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లో 41 పరుగులతో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 29 పరుగులు ఇచ్చాడు. వికెట్‌ మాత్రం తీయలేకపోయాడు.

చదవండి: IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్‌ బయటపడ్డ బెయిల్స్‌! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి!
Suryakumar: ఒకే స్టైల్‌లో రెండు స్టన్నింగ్‌ క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు

మరిన్ని వార్తలు