IND Tour Of SA: 'పొద్దున్నే నేనే దొరికానా.. నన్ను వదిలేయ్‌'

17 Dec, 2021 13:18 IST|Sakshi

IND Tour Of South Africa.. విరాట్‌ కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదం ఎంత రచ్చగా మారిన సంగతి ప్రత్యకేంగా చెప్పనవసరం లేదు. తనను కనీసం సంప్రదించకుండానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌతాఫ్రికా టూర్‌కు బయల్దేరే ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు. గంగూలీ వ్యాఖ్యలను ఖండించిన కోహ్లి.. తనతో ఎలాంటి కమ్యూనికేషన్‌ జరపలేదంటూ బాంబు కూడా పేల్చాడు. ఇలా ఆధ్యంతం రసవత్తరంగా సాగిన వన్డే కెప్టెన్సీ గొడవ దాదాపు సద్దుమణిగినట్లే కనిపిస్తుంది.

చదవండి: IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌.. అహ్మదాబాద్‌ కెప్టెన్‌గా శ్రేయాస్‌!

మాజీ క్రికెటర్లు కూడా చొరవ తీసుకొని.. కాలమే దీనికి సమాధానం ఇస్తుందని.. ఇక కోహ్లి కెప్టెన్సీ విషయం వదిలేసి ఆటపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇచ్చారు. అలా సౌతాఫ్రికా టూర్‌కు జట్టుతో కలిసి ఆ గడ్డపై అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రయాణ సమయంలో కోహ్లి ఫుల్‌ జోష్‌లో ఉన్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోనూ ముంబై నుంచి జో బర్గ్‌(జోహన్నెస్‌బర్గ్‌) అంటూ క్యాప్షన్‌ జత చేసి విడుదల చేసింది. 25 సెకన్ల నిడివి గల వీడియోలో టీమిండియా క్రికెటర్లు సహా ద్రవిడ్‌లు సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. ఇక ఫుల్‌ జోష్‌లో ఉన్న టెస్టు కెప్టెన్‌ కోహ్లి ఇషాంత్‌ శర్మను ఆటపట్టించడం కనిపించింది. కోహ్లి లంబూను ఏదో టీచ్‌ చేయబోతుంటే.. ''పొద్దుపొద్దున్నే నీకు నేనే దొరికానా.. టీజ్‌ చేయకు విరాట్‌ భయ్యా..'' అనడం వైరల్‌గా మారింది. 

ఇక డిసెంబర్‌ 16 నుంచే ప్రారంభం కావాల్సిన సిరీస్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో వారం పాటు వాయిదా పడింది. డిసెంబర్‌ 26 నుంచి ఇరుజట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు వన్డేలు జరగనున్నాయి. ఇక గాయంతో రోహిత్‌ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు