CWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌.... భారత క్రికెట్‌ జట్టుకు గుడ్‌ న్యూస్‌..!

28 Jul, 2022 18:38 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌ మహిళల జట్టుకు గుడ్‌ న్యూస్‌ అందింది. కరోనా బారిన పడిన బ్యాటర్‌ సబ్భినేని మేఘన కోలుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలలో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. దీంతో మేఘన బర్మింగ్‌హామ్‌లో ఉన్న భారత జట్టలో చేరేందుకు సిద్దమైంది. ఇక ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా మేఘన దృవీకరించింది.

ఇక మేఘనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బర్మింగ్‌హామ్‌కు వెళ్లే తన ఫ్లైట్ బోర్డింగ్ పాస్‌ ఫోటోను షేర్‌ చేసింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడానికి భారత జట్టు బర్మింగ్‌హామ్‌కు పయనమయ్యే ఒక్క రోజు ముందు మేఘన, ఆల్‌ రౌండర్‌ పూజా వస్త్రాకర్‌ కరోనా బారిన పడ్డారు.

దీంతో వీరిద్దరూ బర్మింగ్‌హామ్‌కు వెళ్లే ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరులో ఉండిపోయారు. అయితే పూజా ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో జరిగే లీగ్‌ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్‌ వేదికగా ప్రారంభం కానుంది.

ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా,పాకిస్తాన్‌ బార్బడోస్‌ జట్లతో కలిపి భారత్‌ గ్రూప్-ఎలో ఉంది.  గ్రూప్‌-బిలో ఆతిథ్య ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక ఉన్నాయి.  ఆయా గ్రూప్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత తమ తొలి మ్యాచ్‌లో శుక్రవారం(జూలై 29) ఆస్ట్రేలియాతో తలపడనుంది.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా,యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా
చదవండిPV Sindhu: ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో వ్యత్యాసంతో అనుమానం.. ఐసోలేషన్‌కు తరలింపు 

మరిన్ని వార్తలు