సచిన్‌కు మరో అరుదైన గౌరవం.. విశ్వవ్యాప్త సర్వేలో మోదీ తర్వాతి స్థానం

10 Nov, 2021 16:13 IST|Sakshi

Tendulkar Entered Brandwatchs 50 Most Influential People Globally On Twitter: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ట్విటర్‌ వేదికగా బ్రాండ్‌వాచ్ అనే సంస్థ నిర్వహించిన విశ్వవ్యాప్త వార్షిక(2021) పరిశోధనలో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల్లో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కేవలం ఇద్దరు భారతీయులకు మాత్రమే స్థానం లభించగా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో, సచిన్‌ 35వ స్థానంలో నిలిచారు.

మోదీ, సచిన్‌లు అమెరికన్ నటులు డ్వేన్ జాన్సన్(ద రాక్‌), లియోనార్డో డికాప్రియో, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కంటే ముందు వరుసలో ఉన్నారు. ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, సచిన్‌.. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా అనంతరం ఎంపీగా, దశాబ్దానికి పైగా యునిసెఫ్ దక్షిణాసియా అంబాసిడర్‌గా పలు గౌరవాలను దక్కించుకున్న సంగతి తెలసిందే. 
చదవండి: 'ఆ విషయంలో' రవిశాస్త్రి వ్యాఖ్యలను సమర్ధించిన పాకిస్థాన్‌ కెప్టెన్‌

>
Poll
Loading...
మరిన్ని వార్తలు