కోలుకున్న క్రికెట్‌ దేవుడు: ఆస్పత్రి నుంచి ఇంటికి

8 Apr, 2021 20:17 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ బారిన పడిన క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఆరు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి నివాసానికి సచిన్‌ వచ్చాడు. మార్చి 27వ తేదీన కరోనా వైరస్‌ బారినపడగా ఆరు రోజుల అనంతరం సచిన్‌కు ఏప్రిల్‌ 2వ తేదీన కొన్ని లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆరోజే ఆస్పత్రిలో చేరాడు. 6 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం గురువారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యి నివాసానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ట్వీట్‌ చేశాడు.

‘ఇప్పుడే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చా. నేను స్వీయ నిర్బంధంలోనే కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటా. నా కోసం ప్రార్థించిన వారు, ఆ నా ఆరోగ్యంపై శ్రద్ధ చూపెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. వైద్యుల సేవలను మరోసారి గుర్తుచేస్తున్నా. ఏడాది నుంచి వైద్యులు, సిబ్బంది అలుపెరగకుండా మనకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాళ్లు ఎంతో గొప్పవారు’ అని ట్వీట్‌ చేశారు.

చదవండి: నిన్న ఎన్నికలు.. నేడు సీఎంకు కరోనా
చదవండి: మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది

మరిన్ని వార్తలు