Road Safety Series-2: భారత దిగ్గజ జట్టు కెప్టెన్‌గా సచిన్‌ టెండూల్కర్‌

1 Sep, 2022 18:11 IST|Sakshi

క్రికెట్‌ దిగ్గజం, భారత లెజెండరీ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ మరోసారి భారత క్రికెట్‌ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. సెప్టెంబర్‌ 10 నుంచి ఆక్టోబర్‌ 1 వరకు కాన్పూర్‌, రాయ్‌పూర్‌, ఇండోర్‌, డెహ్రడూన్‌ వేదికలుగా జరిగే రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ సీజన్‌-2 కోసం ఇండియన్‌ లెజెండ్స్‌ జట్టుకు సచిన్‌ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇండియన్‌ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ దిగ్గజ జట్లు పాల్గొంటున్నాయి. 

ఈ ఎడిషన్‌లో కొత్తగా న్యూజిలాండ్‌ టీమ్‌ కూడా యాడ్‌ కావడంతో మొత్తం జట్ల సంఖ్య 8కి చేరింది. రోడ్‌ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ తొలి సీజన్‌లో సచిన్‌ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ సీజన్‌-2లో పాల్గొనే భారత జట్టు ఇదే..
సచిన్‌ టెండూల్కర్‌ (కెప్టెన్‌)
రాజేశ్‌ పవార్‌
వినయ్‌ కుమార్‌
యూసఫ్‌ పఠాన్
నమన్‌ ఓజా
సుబ్రమణ్యం బద్రీనాథ్‌
నోయల్‌ డేవిడ్‌
మన్ప్రీత్‌ గోని
మునాఫ్‌ పటేల్‌
ప్రగ్యాన్‌ ఓజా
ఇర్ఫాన్‌ పఠాన్‌
మహ్మద్‌ కైఫ్‌
యువరాజ్‌ సింగ్‌
చదవండి: టీమిండియాతో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌.. కళ్లన్నీ ఆ యువతిపైనే!

మరిన్ని వార్తలు