టాస్‌ గెలిచి బౌలింగ్‌.. రూట్‌ అక్కడే తప్పు చేశాడు

18 Aug, 2021 13:30 IST|Sakshi

లార్డ్స్‌: చారిత్రక లార్డ్స్‌ టెస్టులో టీమిండియా విజయం సాధించడం తనకు సంతోషం కలిగించిందని టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ బౌలింగ్‌ ఎంచుకొని తప్పుచేశాడని పేర్కొన్నాడు.  లార్డ్స్‌ టెస్టులో టీమిండియా విజయం సాధించిన అనంతరం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్‌ మాట్లాడాడు.

‘ఇప్పుడున్న ఇంగ్లండ్‌ టీమ్‌లో రూట్‌ తప్పితే స్థిరంగా క్రీజులో ఉండి వంద పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌ కనిపించడం లేదు. గతంలో అలిస్టర్‌ కుక్‌, మైకెల్‌ వాన్‌, పీటర్సన్‌, ఇయాన్‌ బెల్‌ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో ఉండేవాళ్లు. కానీ ప్రస్తుత  ఇంగ్లండ్‌ జట్టులో అటువంటి బ్యాట్స్‌మెన్లు కానరావడం లేదు. లార్డ్స్‌లో టాస్‌ గెలిచి కూడా రూట్‌ బౌలింగ్‌ ఎంచుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది.. నాకు తెలిసి రూట్‌ అక్కడే తప్పు చేశాడు.

ఇక షమీ, బుమ్రాలు తమ బ్యాటింగ్‌తో లార్డ్స్‌ మైదానంలో అదరగొట్టారు. ఇక మహమ్మద్‌ సిరాజ్‌ పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో అలవరుచుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా బలవంతంగా ఉంది. రానున్న టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి ప్రదర్శననే నమోదు చేసి సిరీస్‌ గెలవాలని ఆకాక్షింస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: రూట్‌ ఒక్కడు ఆడితే సరిపోదు.. ఇలా అయితే కష్టం

మరిన్ని వార్తలు