Sachin Tendulkar: తొలి వన్డే సెంచరీ సాధించడానికి ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో తెలుసా?

10 Sep, 2021 12:59 IST|Sakshi

Sachin Tendulkar  Maiden ODI Century: సచిన్  టెండూల్కర్ ఇది పేరు మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ బ్రాండ్‌.. కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానుల గుండె చప్పుడు. ఇక క్రికెట్ గాడ్ సచిన్‌ టెండూల్కర్ మొదటి వన్డే సెంచరీ సాధించి గురువారానికి ఇరవై ఏడేళ్లు పూర్తయ్యాయి. మరి.. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన లిటిల్‌ మాస్టర్‌కు తన మెదటి వన్డే సెంచరీ సాధించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా..?

1989లో అంతర్జాతీయ క్రికెట్లో టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. తన మెదటి వన్డే సెంచరీ  సాధించడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. 1994, సెప్టెంబర్ 9 న సచిన్‌ ఆస్ట్రేలియాపై తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఇందుకోసం అతడు 79 మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. సచిన్ 130 బంతుల్లో 110 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయం అందించాడు.

అంతర్జాతీయ  వన్డే  మ్యాచ్‌లో తొలి డబుల్‌ సెంచరీ:
2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన  మ్యాచ్లో సచిన్ 200 పరుగులు సాధించి వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే  మైలురాయిని అధిరోహించాడు.

భారత రత్న పొందిన తొలి క్రీడాకారుడు
సచిన్‌.. 16 నవంబర్ 2013 నాడు తన 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న  ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారుడడిగామరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.
 
తండ్రి మరణం:
1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా సచిన్‌ తండ్రి రమేష్ టెండుల్కర్ ఆకస్మాత్తుగా  మృతిచెందారు. తండ్రి అంత్యక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.

చదవండి: Hardik Pandya: అనుకోకుండా ఆల్‌రౌండర్‌ అయ్యాను.. అది నా అదృష్టం

మరిన్ని వార్తలు