షాకింగ్‌గా ఉంది.. నమ్మలేకపోతున్నా: సచిన్‌

2 Mar, 2021 10:32 IST|Sakshi

ముంబై: ‘‘షాకింగ్‌గా ఉంది. అస్సలు నమ్మలేకపోతున్నా’’  అంటూ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ఓ యువకుడిపై ప్రశంసలు కురిపించాడు. రూబిక్‌ క్యూబ్‌ వైపు చూడకుండానే కేవలం 17 సెకన్లలోనే దానిని సెట్‌ చేసిన అతడి ప్రతిభకు ఫిదా అయ్యాడు. ఇందుకు సంబంధించి సచిన్‌ షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముంబైకి చెందిన టీనేజర్‌ మహ్మద్‌ అమన్‌ కొలీకి పజిల్స్‌ సాల్వ్‌ చేయడం అంటే మహా ఇష్టం. ఆ ఆసక్తే అతడిని అందరిలో ప్రత్యేకంగా నిలిపింది. గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించేలా చేసింది. 

ఈ క్రమంలో అతడి గురించి తెలుసుకున్న సచిన్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌ ద్వారా నెటిజన్లకు పరిచయం చేశాడు. ‘‘నాతో పాటు ఇక్కడ అమన్‌ కొలి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. దీనిని రూబిక్‌ క్యూబ్‌ అంటారు. దీనిని ఇప్పుడు అమన్‌ చేతికి ఇస్తాను. అతడు దాని వైపు చూడకుండానే సాల్వ్‌ చేసేస్తాడు. అన్నట్లు తను గిన్నిస్‌ బుక్‌ రికార్డు కూడా సాధించాడు. ఈ భారతీయ యువకుడు మన అందరినీ గర్వపడేలా చేశాడు. మనం నేరుగా చూస్తూ కూడా చేయలేని పనిని అతడు చూడకుండానే చేశాడు. 

ప్రస్తుతం తన ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఏమిటో తెలుసా. తన లాగా నాక్కూడా రూబిక్‌ క్యూబ్‌ సాల్వ్‌ చేయడం నేర్పించడమే’’ అని సచిన్‌ చమత్కరించాడు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు అమన్‌ ప్రతిభను కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం బ్రెట్‌ లీ సైతం.. ‘‘అస్సలు నమ్మలేకపోతున్నా! కవర్‌డ్రైవ్‌ చక్కగా ఉంది’’ అని ప్రశంసించాడు.

చదవండిజోరుగా కోహ్లి, రోహిత్‌, రహానే ప్రాక్టీస్‌

పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిపాదనపై మండిపడ్డ బీసీసీఐ

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు