సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ

25 May, 2021 17:45 IST|Sakshi

ముంబై: కెరీర్ ఆసాంతం ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా నిలిచిన క్రికెట్ గాడ్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని భార్య అంజలీ  టెండూల్కర్ వెల్లడించింది. వీరి జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టి 26 వసంతాలు పూర్తైన సందర్బంగా  ఆమె సచిన్ ను గూర్చిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఆన్ ఫీల్డ్ బౌలర్లను గడగడలాడించే సచిన్ .. మైదానం వెలుపల మాత్రం మహా సిగ్గరి అని, అతను చాలా సున్నిత మనస్కుడని, అనవసరంగా ఎవరితో మాట కలపడని పేర్కొంది. 

ఈ సందర్బంగా ఆమె.. సచిన్ తో 26 ఏళ్ల బంధాన్ని నెమరేసుకుంది. తాము మొట్టమొదటిసారి ఎయిర్ పోర్టులో కలిసామని, తమ పరిచయం ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా బలపడిందని చెప్పుకొచ్చింది. అయితే, సచిన్.. తనను మొదటిసారి అతని తల్లిదండ్రులకు ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడని,  నన్ను అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసేందుకు చాలా కసరత్తులే చేశాడని గుర్తు చేసుకుని నవ్వుకుంది. 

తమ పరిచయమైనా తొలినాళ్లలో ఇప్పటిలా ఇంటర్నెట్,. సోషల్ మీడియా  సదుపాయాలు లేవని, ఫోన్లు ఉన్నప్పటికీ.. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో తాము ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవారిమని తెలిపింది.  కాగా సచిన్, అంజలీల వివాహం 1995లో జరిగింది. వీరికి అర్జున్, సారా అనే ఇద్దరు సంతానం. కొడుకు అర్జున్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.   
చదవండి: రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన కోహ్లి దంపతులు ..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు