టోక్యో ఒలింపిక్స్‌కు స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ అర్హత

27 Jun, 2021 06:21 IST|Sakshi

ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో ‘ఎ’ అర్హత ప్రమాణాన్ని అధిగమించిన తొలి భారతీయ స్విమ్మర్‌గా సజన్‌ ప్రకాశ్‌ గుర్తింపు పొందాడు. రోమ్‌లో జరుగుతున్న సెట్టి కోలి ట్రోఫీ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో కేరళకు చెందిన సజన్‌ ప్రకాశ్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించాడు. తద్వారా విశ్వ క్రీడలకు నేరుగా అర్హత పొందాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ హీట్‌లో సజన్‌ 1ని:56.38 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌ ‘ఎ’ అర్హత ప్రమాణం 1ని:56.48 సెకన్లను అధిగమించి ఒలింపిక్‌ బెర్త్‌ సంపాదించాడు. 27 ఏళ్ల సజన్‌కిది వరుసగా రెండో ఒలింపిక్స్‌ కానుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సజన్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు