ధోనితో షోయబ్‌ మాలిక్‌

20 Nov, 2020 10:50 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌తో తీరిక లేకుండా గడిపిన సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే కొందరు స్నేహితులతో కలిసి సాక్షి బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. సాక్షి సింగ్‌ గురువారం తన  31వ పుట్టినరోజుని జరుపుకున్నారు. భర్త ధోనితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న ఫోటోలను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోనికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  గొల్డెన్‌ డ్రెస్‌లో సాక్షి మెరిసిపోగా, ధోనీ బ్లాక్‌ కలర్‌ టీ షర్ట్‌ని ధరించాడు.  సాక్షి బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. కాగా సాక్షి బర్త్ డే పార్టీలో పాకిస్తాన్‌ క్రికెటర్ షోయబ్ మాలిక్-సానియా మీర్జా దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

ఈసారి సీఎస్‌కేకు ఘోర పరాభవం ఎదుర్కొంది. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్‌ అందించిన ధోని గతేడాది వన్డేకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2020లో అతడు ఆడతాడో లేదోనని అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ధోని సీఎస్‌కే తరపున ఆడుతున్నట్లు ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక విరాట్‌కోహ్లి​కి బీసీసీఐ పితృత్వ సెలవును మంజూరు చేసింది. దీంతో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు అనంతరం విరాట్‌ స్వదేశానికి తిరిగి రానున్నారు. (ధోనిని వదలకుంటే సీఎస్‌కేకు 15 కోట్ల నష్టం)

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు