విరుష్క బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలిస్తే ఔరా అనాల్సిందే..

15 Jul, 2021 18:11 IST|Sakshi

Virat Kohli-Anushka Sharma Bodyguard: దేశంలోని ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మెయింటైన్‌ చేయడం సాధారణ విషయమే. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కూడా బాడీ గార్డ్‌ను మెయింటైన్‌ చేస్తున్నారు. అయితే విరుష్క జోడీ తమ బాడీ గార్డ్‌కు ఇస్తున్న జీతం ఎంతో తెలిస్తే ఔరా అనాల్సిందే. ఓ ప్రముఖ​ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ఈ టాప్‌ సెలబ్రిటీ జంట తమ బాడీ గార్డ్‌కు చెల్లించే వేతనం ప్రముఖ కంపెనీల సీఈవోల జీతం కంటే చాలా రెట్లు ఎక్కువట. విరుష్క కపుల్‌ బాడీ గార్డ్‌గా సేవలందిస్తున్న ప్రకాశ్ సింగ్ అలియాస్‌ సోనూకు ఏటా రూ.1.2 కోట్ల వేతనం చెల్లిస్తున్నారట. అంటే సోనూ జీతం నెలకు 8 లక్షల 50 వేలు అన్నమాట. 

ఈ జీతం భారత్‌లోని చాలా కంపెనీల సీఈవోల వేతనం చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాడీ గార్డ్‌కు అంత జీతమా? అంటూ నెటిజన్లు నోర్లెళ్లబెడుతున్నారు. వేల కోట్లు సంపాదించే వారికి ఇదో లెక్కనా? అని మరికొంతమంది అంటున్నారు. బాడీ గార్డ్ ఉద్యోగం చేసినా బాగుండని మరికొంతమంది నిట్టూరుస్తున్నారు. ఇక సోనూను విరుష్క జోడీ బాడీ గార్డ్ కంటే తమ కుటుంబ సభ్యుడిగానే ట్రీట్ చేస్తోంది. ఎన్నోసార్లు అతని బర్త్‌డే వేడుకులను కూడా ఈ జోడీ సెలబ్రేట్ చేసింది. షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటించి జీరో సినిమా షూటింగ్ సందర్భంగా కూడా అనుష్క.. సోనూ బర్త్‌డే వేడుకలు జరిపింది. 

ఇక అనుష్క ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా సోనూ కుటుంబ సభ్యుడిగా ఆమెకు సేవలందించాడు. కరోనా టైమ్‌లో పీపీఈ కిట్స్ ధరించి మరీ ఆమెకు రక్షణగా నిలిచాడు. ఇప్పుడు అతని బాధ్యత రెట్టింపు అయ్యింది. విరుష్క గారాల పట్టి వామికాను కంటికి రెప్పాల కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇప్పటి వరకు ఆమె ఫొటోను రిలీజ్ చేయని నేపథ్యంలో కెమెరాల నుంచి కూడా రక్షించాల్సిన బాధ్యత సోనూపై ఉంది. కాగా, సోనూ మొదట అనుష్క శర్మ పర్సనల్ బాడీ గార్డ్‌గా ఉన్నాడు. అయితే పెళ్లి తర్వాత అతనే కోహ్లీ‌కి కూడా సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం వీరంతా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌ నిమిత్తం టీమిండియా కెప్టెన్‌ కోహ్లీతో పాటు అతని కుటుంబం కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు