Asia Cup 2022: 'నేను మూడేళ్ల క్రితమే చెప్పాను.. పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి వస్తుందని'

13 Sep, 2022 20:09 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్ బట్‌ ఆ దేశ క్రికెట్‌ బోర్డుపై మండిపడ్డాడు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని బట్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బట్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. "పాక్ సరైన యువ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరముందని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను.  ప్రస్తుతం జట్టు కూర్పు అస్సలు బాగోలేదు. పాక్‌ మిడాలర్డర్‌లో సరైన ఆటగాళ్లు లేరు. జట్టు మేనేజ్‌మెంట్ సీనియర్‌ ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలు యువ క్రికెటర్‌లకు ఇవ్వడం లేదు. అసలు పాకిస్తాన్‌ ప్రణాళికలు ఎంటో నాకు ఆర్ధం కావడం లేదు.

అదే విధంగా ఆసియాకప్‌లో ఓటమి అనంతరం రిపోర్టర్లు హెడ్‌కోచ్‌ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగలేదో నాకు తెలియదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నవాజ్ అద్భుమైన బ్యాటింగ్‌ చేశాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో అతడిని ఎందుకు ఆ స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు రాలేదు? నసీమ్ షా డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అటువంటి అప్పడు అతడితో ముందు తన నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయంచరు..? ఇటువంటి ఎన్నో తప్పులు ఆసియాకప్‌లో పాక్‌ చేసింది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్‌

మరిన్ని వార్తలు