గంగూలీని ఎలా గద్దె దించారో.. కోహ్లిని కూడా అదే తరహాలో..

9 Dec, 2021 15:58 IST|Sakshi

ముంబై: టీ20 ప్రపంచ కప్-2021 తర్వాత టీమిండియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పొట్టి ఫార్మాట్‌ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లినే స్వచ్ఛందంగా తప్పుకోగా, తాజాగా కోహ్లిని టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడన్న కారణం చూపిస్తూ బీసీసీఐ అవమానకర రీతిలో కోహ్లిపై వేటు వేసింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తరువాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని బీసీసీఐ కోహ్లిని కోరినప్పటికీ.. అతను పెడచెవిన పెట్టాడు. 


దీంతో గతంలో గంగూలీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించిన తరహాలోనే కోహ్లిపై కూడా బలవంతపు వేటు వేసింది. వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లికి ఘనమైన రికార్డే ఉన్నప్పటికీ.. బీసీసీఐ వీటిని పరిగణలోకి తీసుకోకుండా అతన్ని తప్పించింది. 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత నాటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని కూడా ఇదే తరహాలో తప్పించింది. గంగూలీ అప్పట్లో కెప్టెన్‌గా సక్సెస్ అయినా, బ్యాట్స్‌మెన్‌గా దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు అదే గంగూలీ బీసీసీఐ బాస్‌ హోదాలో ఉండి కెప్టెన్సీ నుంచి కోహ్లిని అవమానకర రీతిలో తప్పించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. 

చదవండి: ODI Captain: కోహ్లికి షాక్‌.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ.. బీసీసీఐ అధికారిక ప్రకటన

మరిన్ని వార్తలు