ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లను బలి తీసుకున్న బ్రెయిన్‌ ట్యుమర్‌

19 Apr, 2022 19:06 IST|Sakshi

ప్రాణాంతక వ్యాధి బ్రెయిన్‌ ట్యుమర్‌ ఒకే రోజు ఇద్దరు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లను బలి తీసుకుంది. ఈ ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం. బంగ్లాదేశ్ తొలి వన్డే జట్టులో సభ్యుడైన సమియుర్ రెహమాన్ (69) బ్రెయిన్‌ ట్యుమర్‌ వ్యాధి కారణంగా ఇవాళ (ఏప్రిల్ 19) ఢాకాలోని సిటీ ఆసుపత్రిలో కన్నుమూయగా, ఇదే రోజు బంగ్లా మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మొషారఫ్ హొస్సేన్ (40) అదే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మృతి చెందాడు. ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు కన్నుమూయడం పట్ల బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 


(సమియుర్ రెహమాన్)
రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన సమియుర్‌ బంగ్లాదేశ్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోగా, మొషారఫ్ హొస్సేన్ 2008-16 మధ్యలో 5 వన్డేలు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. సమియుర్ ఆటగాడిగా రిటైర్‌ అయిన అనంతరం బంగ్లా దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించగా, మొషారఫ్ హొస్సేన్.. బంగ్లా దేశవాళీ టోర్నీల్లో 572 వికెట్లు పడగొట్టి స్టార్‌ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
చదవండి: లక్నోతో మ్యాచ్‌.. భారీ రికార్డులపై కన్నేసిన దినేశ్‌ కార్తీక్‌

మరిన్ని వార్తలు