Sanath Jayasuriya: లంక ప్రభుత్వంలో దిగ్గజ క్రికెట‌ర్ జ‌య‌సూర్యకు కీల‌క బాధ్యత‌లు

10 Aug, 2022 08:17 IST|Sakshi

Sanath Jayasuriya Appointment As Srilanka Tourism Envoy: రాజకీయ అనిశ్చితి, ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక, మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పలాయనం తర్వాత ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుకునే పనిలో పడింది. రణిల్‌ విక్రమసింఘే నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవ‌స్థకు మూల స్థంభ‌మైన ప‌ర్యాట‌క రంగానికి పున‌రుత్తేజం తీసుకువ‌చ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆ దేశ మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆటగాడు స‌న‌త్ జ‌య‌సూర్యకు కీల‌క బాధ్యత‌లు అప్పజెప్పింది. జయసూర్యను టూరిజం ప్రచార‌క‌ర్తగా నియ‌మిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సనత్‌ టూరిజం ప్రచార‌క‌ర్తగా బాధ్యతలు చేపట్టిన వెంట‌నే కొలంబోలోని భార‌త రాయ‌బారి గోపాల్ బాగ్లేని క‌లిసి, దేశంలో టూరిజం అభివృద్దికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంక‌లోని హిందూ ఆల‌యాలు, ఇత‌ర హిందూ ప‌ర్యాట‌క ప్రదేశాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని, వాటికి ప్రాచుర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే, రామాయ‌ణానికి సంబంధించి దేశంలో ఉన్న ప‌ర్యాట‌క ప్రదేశాల‌పై ప్రత్యేక దృష్టి పెడతామ‌న్నారు. శ్రీలంక జీడీపీలో టూరిజం వాటా దాదాపు 12 శాతం ఉంది.
చదవండి: త్వరలోనే స్టార్‌ ప్లేయర్‌ రిటైర్మెంట్‌

మరిన్ని వార్తలు