సందీప్‌ రికార్డు బౌలింగ్‌..కోహ్లి మరో ‘సారీ’

31 Oct, 2020 21:44 IST|Sakshi

షార్జా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ సందీప్‌ శర్మ రికార్డు సాధించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(7) ఔట్‌ చేయడం ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సందీప్‌ శర్మ వేసిన ఐదో ఓవర్‌ నాల్గో బంతికి విలియమ్సన్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి పెవిలియన్‌ చేరాడు. అయితే ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లిని ఏడోసారి ఔట్‌ చేసిన రికార్డును సందీప్‌ సాధించాడు. ఇది ఐపీఎల్‌లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్‌ చేసిన రికార్డును సందీప్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఐపీఎల్‌లో అత్యధిక సార్లు కోహ్లిని ఔట్‌ చేసిన రికార్డును సమం చేసిన సందీప్‌.. దాన్ని తాజాగా అధిగమించాడు. (‘శ్రేయస్‌ అయ్యర్‌ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్‌ చాన్స్‌ కష్టమే’)

ఐపీఎల్‌లో కోహ్లిని ఆరుసార్లు ఔట్‌ చేసిన బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా.  ఇప్పుడు నెహ్రాను అధిగమించాడు సందీప్‌. ఐపీఎల్‌లో కోహ్లిని అత్యధిక సార్లు ఔట్‌ చేసిన జాబితాలో సందీప్‌, నెహ్రాల తర్వాత స్థానంలో మిచెల్‌ మెక్లీన్‌గన్‌, మహ్మద్‌ షమీలు ఉన్నారు. వీరిద్దరూ తలో మూడుసార్లు కోహ్లిని ఔట్‌ చేశారు. ఇక ఐపీఎల్‌లో ఒక ఆటగాడ్ని అత్యధిక సార్లు ఔట్‌ చేసిన జాబితాలో జహీర్‌ఖాన్‌తో కలిసి సందీప్‌ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని జహీర్‌ఖాన్‌ అత్యధికంగా ఏడుసార్లు ఔట్‌ చేశాడు. సన్‌రైజర్స్‌తో తాజా మ్యాచ్‌లో ఆర్సీబీ 120 పరుగులే చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేయడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు