ఒలింపిక్‌ కిట్‌తో సానియా డ్యాన్స్‌ అదుర్స్‌.. వైరల్‌ వీడియో

14 Jul, 2021 19:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు భారత అథ్లెట్లు తమ సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా  అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకునే టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

A post shared by Sania Mirza (@mirzasaniar)

ఒలంపిక్స్‌ గేమ్స్‌లో పాల్గొనబోతున్న సానియా మీర్జా కొత్త ఇండియన్‌ ఒలింపిక్‌ కిట్‌ను ధరించి డాన్స్‌ చేశారు. అమెరికన్ రాపర్ డోజా క్యాట్‌కు సంబంధించిన తాజా హిట్ పాట ‘కిస్ మి మోర్’కు బ్లూ కలర్‌ జెర్సీ ధరించి నృత్యం చేశారు. ‘నా పేరులో వచ్చే ఇంగ్లీష్‌ లెటర్‌ ‘ఏ’ను విస్తరిస్తే.. అందులో చాలా జీవితం ఉంది. దూకుడు, ఆశయం, సాధించడం, ఆప్యాయత అన్ని అందులో ఉన్నాయి’ అని ఆమె కామెంట్‌ జతచేశారు. ఆమె పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా ఇప్పటికే 55వేల మంది లైక్‌ చేశారు. ఈ వీడియోను వీక్షించిన పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా.. ‘నీ డాన్స్‌ మూవ్‌మెంట్స్‌ నాకు చాలా నచ్చాయి. నీకు అభినందనలు’ అని కామెంట్‌ చేశారు. ఆమెకు పలువురు అభిమానులు టోక్యో ఒలంపిక్స్‌కు ‘ఆల్‌ ద బెస్ట్‌’ తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక భారత ఒలంపిక్స్‌ అసోషియేషన్‌.. కొత్త ఇండియన్‌ ఒలింపిక్స్‌ కిట్‌ను గత నెల విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నిన్న(మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సానియా.. టోక్యో ఒలంపిక్స్‌ కోసం తాను చేస్తున్న సాధన గురించి ప్రధానికి వివరించారు. మహిళల డబుల్స్ విభాగంలో సానియా, అంకితా రైనాతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.    

మరిన్ని వార్తలు