సీజన్‌లో తొలి టైటిల్‌కు విజయం దూరంలో...

29 Aug, 2021 05:40 IST|Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అమెరికాలోని ఒహాయోలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–క్రిస్టినా మెకేల్‌ (అమెరికా) జంట  ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 7–6 (7/5), 6–2తో ఐకెరి (నార్వే) –కేథరిన్‌ హ్యారిసన్‌ (అమెరికా) జోడీపై గెలుపొందింది. గంటా 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను సానియా జంట నాలుగు సార్లు బ్రేక్‌ చేసింది. మ్యాచ్‌ ముగిశాక తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి సానియా ఆనందం పంచుకుంది. ఫైనల్లో టాప్‌ సీడ్‌ సుకో అయోమా–ఎనా షిబహార (జపాన్‌) జోడీతో సానియా–క్రిస్టినా జంట తలపడుతుంది.

మరిన్ని వార్తలు