AUS Open 2023: ‘మిక్స్‌డ్‌’ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సానియా జోడీ 

22 Jan, 2023 07:01 IST|Sakshi

తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి రౌండ్‌లో సానియా–రోహన్‌ బోపన్న (భారత్‌) జోడీ 7–5, 6–3తో జైమీ ఫోర్‌లిస్‌–ల్యూక్‌ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–బోపన్న ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశారు.    

జీవన్‌–బాలాజీ ద్వయం సంచలనం
చివరి నిమిషంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న భారత డబుల్స్‌ జోడీ జీవన్‌ నెడుంజెళియన్‌–శ్రీరామ్‌ బాలాజీ సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి  రౌండ్‌లో జీవన్‌–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం 7–6 (8/6), 2–6, 6–4తో ఐదో సీడ్‌ ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి రెండో రౌండ్‌కు చేరుకుంది. 

మరిన్ని వార్తలు