సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 

14 May, 2022 07:32 IST|Sakshi

ఇటాలియన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా (భారత్‌)–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రోమ్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–4, 4–6, 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో అలెక్సా గ్వరాచి (చిలీ)– ఆంద్రియా క్లెపాక్‌ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–హర్డెస్కా జంట నాలుగు ఏస్‌లు సంధించింది. 

మరిన్ని వార్తలు