వాడే నా జీవితం : సానియా

27 Aug, 2020 09:05 IST|Sakshi

తల్లి కావడం గొప్ప వరం. ప్రతి మహిళ కూడా ‘అమ్మ’ పిలుపును అత్యుత్తమ గౌరవంగా భావిస్తుంది. బిడ్డను ఆడిస్తూ, పాడించాలని కోరుకుంటుంది. పార్కుల్లోకి తీసుకెళ్లి ప్రకృతిని పరిచయం చేయాలని ఆశపడుతుంది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడవన్నీ నాశనం అయ్యాయి. ఈ మహమ్మారి పిల్లల ఆహ్లాదకరమైన పనులన్నీ నాశనం చేసింది. పిల్లలకు స్కూళ్లుల్లేవు, బయటకు తీసుకెళ్దామంటే కరోనా భయం.ఇంట్లో ఉండే పిల్లలు నాలుగు గోడలమధ్యే ఉండాల్సిన పరిస్థితి.

ఈ మహమ్మారి తల్లుల జీవితాలను చాలా కష్టతరం చేసింది. ఎందుకంటే చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటానికి వారికి కష్టమైన పని. చిన్న పిల్లలను ఆడించడం, చురుకుగా ఉంచాలంటే మాములు విషయం కాదు. కానీ ప్రతి తల్లి తన పిల్లలను ఇంట్లో వినోదభరితంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. దీనికి భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా అతీతం కాదు. కరోనా సమయంలో సానియా మీర్జా తన కొడుకు ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో ఎక్కువ సమయం గడుపుతోంది. ఆమె అటు టెన్నిస్‌ ప్రాక్టీస్‌ను, ఇటు కొడుకు ఆలనా పాలనను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.(చదవండి : బాబాయ్‌ ఫోర్‌ కొడితే.. బాబా సిక్సర్‌ బాదుతాడు)

బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన సానియా.. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు. ఓ వైపు టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే.. తన లిటిల్‌ హీరో ఇజాన్‌ మీర్జా మాలిక్‌తో ‘అమ్మ’తనాన్ని ఆస్వాదిస్తున్నారు. కొడుకును గ్రౌండ్‌కు తీసుకెళ్లి స్వేచ్ఛగా తిప్పుతోంది. బుడ్డోడు చేసే చిలిపి పనులు చూసి మురిసిపోతుంది. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటుంది. ‘వాడే నా జీవితం.. నాలో భాగం నా లిటిల్‌ హీరో’ అంటూ సానియా మురిసిపోతుంది.

తల్లి అయిన తర్వాత తన జీవితమే మారిపోతుందని చెబుతోంది. ఒక తల్లిగా నా కుమారుడిని ఆలనా, పాలన చూసూకోవడం తన బాధ్యత అంటుంది. ‘ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ, ఇది పొందుతున్న అద్భుతమైన అనుభూతి’ అంటూ సానియా తన కుమారుడి ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది.అక్టోబర్‌ 30, 2018న సానియా ఇజాన్‌ మీర్జా మాలిక్‌కు‌ జన్మనిచ్చిన విషయం తెలిసిందే.


Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా