వైరల్‌: డాన్స్‌ బాగుంది సంజన.. బుమ్రా ఎక్కడ?

22 May, 2021 13:44 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌-2021 వాయిదా పడటంతో స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌​ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేస్తూ ఉల్లాసంగా స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో.. ‘‘మీరు బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు. మరి బుమ్రా ఎక్కడ వదినమ్మా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంజనా- బుమ్రా ఈ ఏడాది మార్చి 15న గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇక పెళ్లి కారణంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన బుమ్రా.. ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా తిరిగి మైదానంలో దిగాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు టోర్నీ వాయిదా పడటంతో ఇంటికి చేరుకున్నాడు. ఇక సంజన సైతం ఐపీఎల్‌ అఫీషియల్‌ బ్రాడ్‌కాస్టర్‌ ప్రజెంటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ ఆడేందుకు బుమ్రా ఇంగ్లండ్‌ పయనానికి సన్నద్ధమయ్యే క్రమంలో క్వారంటైన్‌లో ఉండగా, సంజన ఇలా ఒక్కరే డ్యాన్స్‌ చేస్తూ కనిపించడం విశేషం. ఇదిలా ఉండగా..  ఇంగ్లండ్‌ సిరీస్‌ ముందు క్వారంటైన్‌ రోజుల్ని కుదించాలన్న బీసీసీఐ విజ్ఞప్తికి ఈసీబీ సానుకూలంగా స్పందించింది. తద్వారా నాలుగో రోజు నుంచే జట్లు ప్రాక్టీస్‌ చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. అయితే క్రికెటర్లకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చిన ఈసీబీ.. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్‌ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

చదవండి: ఆస్ట్రేలియన్లు.. ఆస్ట్రేలియన్లలా ఆడరు ఎందుకో?!
 WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు