RCB New Captain: డివిలియర్స్‌ కెప్టెన్‌ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్‌

25 Sep, 2021 16:21 IST|Sakshi

RCB New Captain After Virat Kohli.. ఐపీఎల్‌ 2021 తర్వాత విరాట్‌ కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీ పదవి నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే కోహ్లి కెప్టెన్సీ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపాడు. అయితే కోహ్లి తర్వాత ఆర్‌సీబీకి కెప్టెన్‌ ఎవరు వ్యవహరిస్తే బాగుంటుందనే దానిపై టీమిండియా మాజీ క్రికెటర్‌.. క్రికెట్‌ ఎక్స్‌పర్ట్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించాడు.

''కోహ్లి పక్కకు తప్పుకున్న తర్వాత ప్రస్తుతం వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఏబీ డివిలియర్స్‌కు కెప్టెన్‌ అయ్యే అవకాశాలు లేవు. అతను జట్టును సరైన రీతిలో నడిపించలేడు. అంతేగాక వచ్చే ఐపీఎల్‌లో అతను ఆడే చాన్సులు కూడా చాలా తక్కువ. నా దృష్టిలో పొలార్డ్‌ ఆర్‌సీబీ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వేలంలో అతను ముంబై ఇండియన్స్‌ను నుంచి రిలీవ్‌ అయితే మాత్రం ఆర్‌సీబీ అతని కొనుగోలుపై ఆసక్తి చూపుతుంది. అంతేగాక ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ గైర్హాజరీలో పలుమార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన పొలార్డ్‌ ముంబైకి మంచి విజయాలు అందించాడు. అతని అనుభవం ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంది.

చదవండి: Gautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్‌ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి!

ఒకవేళ అతను కాదంటే తర్వాత కెప్టెన్‌ అయ్యే అవకాశాలు సూర్యకుమార్‌ లేదా డేవిడ్‌ వార్నర్‌లకు ఉంది. వచ్చే వేలంలో సూర్యకుమార్‌.. వార్నర్‌ల కోసం కచ్చితంగా పోటీ ఉండే అవకాశం ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ డేల్‌ స్టెయిన్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌కు ఆర్‌సీబీ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. దీంతోపాటు డివిలియర్స్‌ కెప్టెన్‌ కాలేడని మంజ్రేకర్‌ చేసిన వ్యాఖ్యలను స్టెయిన్‌ సమర్థించడం విశేషం. 

చదవండి: Kohli Big Six: కోహ్లి కొడితే మాములుగా ఉంటుందా.. స్టేడియం అవతలే

మరిన్ని వార్తలు