IND Vs SA: 'దటీజ్‌ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి'

7 Oct, 2022 08:09 IST|Sakshi

లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత ఆటగాడు సంజూ శాంసన్‌ అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అఖరి ఓవర్‌లో భారత్‌ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా.. సంజూ 19 పరుగులు మాత్రమే చేయగల్గిడాడు. మరో పరుగు వైడ్‌ రూపంలో వచ్చింది.

ఓవరాల్‌గా అఖరి ఓవర్‌లో భారత్‌కు 20 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న సంజూ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓ దశలో 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను శ్రేయస్‌ అయ్యర్‌, శాంసన్‌ తిరిగి గాడిలో పెట్టారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అయ్యర్‌ 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇక సంజూ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరోసారి అందరినీ అకట్టుకున్నాడు. దీంతో  టీ20 ప్రపంచకప్‌కు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు మళ్లీ  బీసీసీఐపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. శాంసన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, ఇప్పటికైన బీసీసీఐ కళ్లు తెరవాలని అతడి అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్‌ చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌కు సంజూను ఎంపిక చేయకపోవడం పట్ల అతడి అభిమానులు మొదటి నుంచి తమ ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.


చదవండిT20 World Cup 2022: దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం

మరిన్ని వార్తలు