Sanju Samson: రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌: జట్టును వీడనున్న సంజూ శాంసన్.. సీఎస్‌కేకు!?

8 Nov, 2021 14:36 IST|Sakshi

Sanju Samson Joins Chennai Super kingsవచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. కెప్టెన్‌ సంజూ శాంసన్ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ జట్టులో చేరతాడన్న ఆసక్తి అందరిలో ఉండగా.. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో అతడు చేరనున్నట్లు సమాచారం.

దీనికి కారణం సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్‌ను ఆన్‌ ఫాలో చేసిన శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫాలో అవుతుండడమే. దీంతో రాజస్తాన్‌ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వచ్చేందుకు శాంసన్ ఆసక్తి చూపిస్తున్నాడని వినికిడి. ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌లో 14 మ్యాచ్‌ల‌లో సంజూ 484 ప‌రుగులు చేశాడు. అయితే బ్యాట్స్‌మ‌న్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి.. కెప్టెన్‌గా ఆ జట్టుకు శాంసన్  టైటిల్‌ అందించకలేకపోయాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్ లో ఐపీఎల్ మెగా వేలం జరిగే అవకాశం ఉంది.

చదవండిGautam Gambhir: త్వరలో భారత్‌కు టీ20 ప్రపంచకప్ తీసుకువస్తారు...

మరిన్ని వార్తలు