French Open Super 750 : సాత్విక్‌- చిరాగ్‌ జోడి సంచలనం.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో

29 Oct, 2022 18:52 IST|Sakshi

భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ సిరీస్‌ సూపర్‌-750 పురుషుల డబుల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-18, 21-14తో చోయ్ సోల్ గ్యు-కిమ్ వాన్ హో ద్వయం(కొరియా)పై విజయం సాధించింది. 45 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జంట ఆద్యంతం ఆధితప్యం చెలాయించారు.

కాగా ఈ ఏడాదిలో ఈ జోడికి ఇది రెండో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఇంతకముందు జనవరిలో ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో ఫైనల్‌ చేరిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి టైటిల్‌ కొల్లగొట్టింది. తాజాగా మరో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌పై కన్నేసింది. కాగా ఈ టోర్నీలో ఎనిమిది మంది భారత షట్లర్లు పాల్గొనగా మిగిలింది ఈ ఒక్క జంట మాత్రమే. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ తో పాటు సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు