ISSF World Cup 2022: భారత్‌కు తొలి గోల్డ్ మెడల్.. అదరగొట్టిన సౌర‌భ్ చౌద‌రీ

2 Mar, 2022 11:59 IST|Sakshi

Saurabh Wins Gold In ISSF World Cup In Cairo: సీనియర్‌ విభాగంలో తొలిసారి ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్‌ ఇషా సింగ్‌ అదరగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 17 ఏళ్ల ఇషా సింగ్‌ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్‌’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్‌) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ భాగంలో సౌరభ్‌ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో సౌరభ్‌ 16–6తో మైకేల్‌ ష్వాల్డ్‌ (జర్మనీ)పై గెలిచాడు. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్‌ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం.

చదవండి: IND vs IRE: మూడేళ్ల తర్వాత ఐర్లాండ్‌ పర్యటనకు టీమిండియా.. రోహిత్‌, కోహ్లి లేకుండానే!

>
మరిన్ని వార్తలు